🔴 పోలవరం జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ :

నూతన జిల్లా పోలవరంలో అధికారులు, సిబ్బంది తమ ఆఫీస్ కార్యాలయాలలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గురువారం స్థానిక జిల్లా నీటి యాజమాన్యం సంస్థ కార్యాలయంలో అసిస్టెంట్ ప్రొజెక్ట్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ సిబ్బంది నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్బంగా శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ..
నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో గిరిజన ఆదివాసీల జీవన ప్రమాణాలు పెంచడానికి వనరులు పుష్కలంగా ఉన్నాయని సమృద్ధిగా ఉన్న ఈ వనరులను నిబంధనలు మేరకు ప్రజల అవసరాలకు వినియోగిస్తే గిరిజన అభివృద్ధి సాధ్యమని అన్నారు.
పోలవరం 12 మండలాలలో ఉపాధిహామీ పథకం క్షేత్రస్థాయిలో అమలుకు మంచి అవకాశం ఉన్నందున సిబ్బంది సహకారంతో గ్రామీణ శ్రామికుల అభివృద్ధికి కృషి జరగాలని అన్నారు. రానున్నా రోజుల్లో ఉపాధిహామీ పథకం అమలులో పోలవరం జిల్లాని రాష్ట్రంలో ప్రధమస్థానంలో ఉంచడానికి సిబ్బంది అందరు సహకరించాలని శ్రీనివాస విశ్వనాధ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యమంలో ఏపీఓలు సత్యనారాయణ, స్వామి, రెడ్డిబాబు, ప్రకాష్, చినబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Efforts to make Polavaram district a leader in the state in the implementation of employment guarantee scheme
Officials, staff at Polavaram district offices celebrated New Year 2026 festivities grandly on Thursday. At the local District Water Management Agency office in Rampachodavaram, Assistant Project Director Tootika Srinivasa Vishwanath led MGNREGA staff in vibrant New Year events.
Addressing the gathering, Viswanath emphasized abundant resources in the new Polavaram district to uplift tribal communities’ living standards. “Utilize these effectively per norms for tribal development,” he urged. Highlighting opportunities across 12 mandals, he called for staff collaboration to boost rural workers’ welfare and position Polavaram as Andhra Pradesh’s top MGNREGA implementer.
APOs Satyanarayana, Swami, Reddibabu, Prakash, Chinababu, Suresh and others participated.

