The Desk…Rampachodavaram : ‘వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే’ కార్యక్రమంపై ప్రజలలో విస్తృత ప్రచారం జరగాలి ➖ డిడిఓ శ్రీనివాస విశ్వనాధ్

The Desk…Rampachodavaram : ‘వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే’ కార్యక్రమంపై ప్రజలలో విస్తృత ప్రచారం జరగాలి ➖ డిడిఓ శ్రీనివాస విశ్వనాధ్

🔴 అల్లూరి జిల్లా : అకూరు / రంపచోడవరం : ది డెస్క్ :

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రమంగా కడుక్కోవాలని రంపచోడవరం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఆకురు గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన శ్రీనివాస విశ్వనాధ్ సిబ్బందితో ‘వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు..

సందర్భంగా డిడిఓ విశ్వనాథ్ మాట్లాడుతూ…

వ్యక్తిగత శుభ్రం ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ‘వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో స్థానికులకు, చిన్నారులకు శిక్షణ ఇచ్చారు.

అనంతరం గ్రామ సచివాలయం ద్వారా సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలపై శ్రీనివాస విశ్వనాధ్ ఆరాతీసి, మనమిత్ర వాట్సాప్ సేవలను, ఆది కర్మయోగి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను, సూపర్ GST ,సూపర్ సేవింగ్స్ తదితర ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని సిబ్బందికి సూచించారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ కె సురేష్ రెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పి. గంగాభవాని, మహిళా పోలీస్ సిహెచ్ ప్రేమ కుమారి తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేసిన శ్రీనివాస విశ్వనాధ్… రంపచోడవరం మండలం, ఆకురు గ్రామ పంచాయతీ తనిఖీలో భాగంగా అంగన్వాడీ కేంద్రాన్ని డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాస విశ్వనాధ్ పరిశీలించారు. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అని పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై అరా తీశారు. ఈ సందర్భంగా…చిన్నారుల బరువును స్వయంగా వేఇంగ్ యంత్రం ద్వారా పరిశీలించి రికార్డులలో నమోదు చేసారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మామిడి వెంకట గిరి, ఆయా మడకం శాంత కుమారి పాల్గొన్నారు.