🔴 పోలవరం జిల్లా :రంపచోడవరం : ది డెస్క్ :

నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రొజెక్ట్ డైరెక్టర్ గా ఏపీడీ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను అల్లూరి సీతారామరాజు జిల్లా, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నియమించారు.
శ్రీనివాస విశ్వనాధ్ ఇప్పటికే జిల్లాలో కీలక విభాగమైన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నోడల్ అధికారిగా, జిల్లా స్వర్ణ పంచాయతీ అధికారిగా పోలవరం జిల్లాకు సేవలు అందిస్తున్నారు.
విధి నిర్వహణలో నిబద్దత, ప్రభుత్వ సేవలు, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండడం, వివిధ శాఖలను సమన్వయం చేయడంలో ఉన్న నేర్పరి తనం, సమస్యలు పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించడం వెరసి శ్రీనివాస విశ్వనాధ్ పేరును ద్వామా పీడీగా నియామకానికి కారణమని తెలిసింది.

