The Desk … Rampachodavaram : జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ జిల్లా అధికారిగా తూతిక శ్రీనివాస విశ్వనాధ్ నియామకం

The Desk … Rampachodavaram : జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ జిల్లా అధికారిగా తూతిక శ్రీనివాస విశ్వనాధ్ నియామకం

🔴 పోలవరం జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ :

నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు జిల్లా గ్రామ, వార్డు సచివాలయం అధికారిగా ద్వామా ఏపీడీ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నియమించారు. శ్రీనివాస విశ్వనాధ్ ఇప్పటికే జిల్లాలో కీలక విభాగమైన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నోడల్ అధికారిగా సేవలు అందిస్తున్నారు. విధి నిర్వహణలో నిబద్దత, ప్రభుత్వ సేవలు, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండడం, వివిధ శాఖలను సమన్వయం చేయడంలో ఉన్న నేర్పరి తనం ముఖ్యంగా సమస్యలు పరిష్కారంలో చురుకైనా పాత్ర పోషించడం వెరసి శ్రీనివాస విశ్వనాధ్ పేరును జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ జిల్లా అధికారిగా నియామకానికి కారణమని తెలిసింది.

సందర్బంగా శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ.

గ్రామ సచివాలయాలను స్వర్ణ పంచాయితీలుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనను ప్రజలలోకి తీసుకెళ్లాడానికి కృషి చేస్తానన్నారు. గ్రామ సచివాలయం సిబ్బంది సహకారంతో పోలవరం జిల్లాను అన్ని ప్రాధాన్యత అంశాలలో ముందువరసలో ఉంచుతానని అన్నారు. తన మీద నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన కలెక్టర్ దినేష్ కుమార్, పిఓ, ఐటిడిఏ బచ్చు స్మరణ్ రాజ్ కు శ్రీనివాస విశ్వనాధ్ ధన్యవాదములు తెలిపారు.