The Desk…Rampachodavaram : ఉపాధిహామీ శ్రామికుల సంక్షేమమే మొదటి ప్రాధాన్యం                 ➖ఏపీడి శ్రీనివాస విశ్వనాధ్

The Desk…Rampachodavaram : ఉపాధిహామీ శ్రామికుల సంక్షేమమే మొదటి ప్రాధాన్యం ➖ఏపీడి శ్రీనివాస విశ్వనాధ్

🔴 అల్లూరి జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ :

సిబ్బంది సహకారంతో ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపాధిహామీ శ్రామికుల సంక్షేమమే మొదటి ప్రాధాన్యంగా విధులు నిర్వహిస్తానని రంపచోడవరం డివిజన్ డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.

గురువారం పాడేరులో కలెక్టర్ దినేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన డ్వామా ఏపీడీగా తూతిక శ్రీనివాస విశ్వనాధ్ భాద్యతలు స్వీకరించారు. గత సంవత్సర కాలంగా మారేడుమిల్లి ఎంపీడీఓగా సేవలందిస్తూ మండలాన్ని రాష్ట్రస్థాయిలో ప్రగతి పథంలో నిలిపిన శ్రీనివాస విశ్వనాధ్ 2007 గ్రూప్-1లో ఎంపీడీఓగా ఉద్యోగానికి ఎంపికై ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో ఎంపీడీఓగా వివిధ మండలాలలో సేవలో అందించి ప్రజా మన్ననలు పొందారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో డీపీఓగా, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా విశేష సేవలు అందించి ప్రభుత్వం నుంచి పురష్కారం అందుకున్నారు.

ప్రభుత్వం లక్షలాది మంది నిరుపేదలకు ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పేరును 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సూచించి ప్రశంసలు అందుకున్న శ్రీనివాస విశ్వనాధ్ డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పదోన్నతిపై డిడిఓ క్యాడరులో డ్వామా ఏపీడిగా రంపచోడవరం డివిజన్ కి ప్రభుత్వం నియమించింది.