The Desk … Rajamahrndravaram : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు – అవగాహన కార్యక్రమాలు

The Desk … Rajamahrndravaram : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు – అవగాహన కార్యక్రమాలు

🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (NRSM)– 2026 కార్యక్రమాల్లో భాగంగా.. బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని లాలాచెరువు ట్రాఫిక్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రత అమలు మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

సందర్భంగా జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ :

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు, సీట్‌బెల్ట్ ధరించకుండా కార్లు నడిపే డ్రైవర్లు, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడేవారు, అలాగే తప్పుడు రోడ్ లైన్లలో వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమించిన 30 మంది వాహనదారులపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా లాలాచెరువు వద్దనున్న మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థినీ, విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులకు రహదారి భద్రత నియమాలు, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులకు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం యొక్క అవసరం, ప్రాముఖ్యతను తెలియజేసేలా చైతన్య దూతలుగా మారాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో రవాణా అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి. హెచ్. సంపత్ కుమార్, ఎం. రవికుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బి. ఉమా మహేశ్వర రావు, జి. ప్రణీత్ కుమార్, పి.వి.వి.డి. సాయి కుమార్, మున్సిపల్ హై స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

National Road Safety Month : Awareness Drives in Rajamahendravaram

As part of the National Road Safety Month (NRSM) 2026, authorities conducted road safety enforcement and awareness programs at Lala Cheruvu traffic junction here on Wednesday.

District Transport Officer R. Suresh emphasized that road safety is everyone’s responsibility. “Even minor negligence can lead to fatal accidents,” he said, urging drivers to strictly follow rules to protect themselves and others. Special focus targeted helmet-less two-wheeler riders, seatbelt violators, mobile-using drivers, and those ignoring lane markings. Cases were registered against 30 offenders.

Simultaneously, at the nearby Municipal High School, around 200 students received training on safety norms, helmet and seatbelt benefits. Officials directed them to act as awareness ambassadors, educating families.

The event saw participation from Transport officials, Motor Vehicle Inspectors C.H. Sampath Kumar and M. Ravikumar, Assistant MVIs B. Uma Maheshwara Rao, G. Praneeth Kumar, P.V.V.D. Sai Kumar, students, and others.