The Desk…Rajamahrndravaram : 37వ జాతీయ భద్రతా మాసోత్సవాలు

The Desk…Rajamahrndravaram : 37వ జాతీయ భద్రతా మాసోత్సవాలు

తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీని రవాణాశాఖ అధికారులు సందర్శించారు.

జాతీయ రహదారి భద్రతా మాసం (NRSM) – 2026 కార్యక్రమంలో భాగంగా పనిచేయుటకు 25 మంది విద్యార్థి వాలంటీర్లను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా రవాణా అధికారి సురేష్ తెలిపారు.

ఎంపికైన వాలంటీర్లకు NRSM-2026 కార్యక్రమం యొక్క అజెండా, లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాలపై విపులంగా అవగాహన కల్పించడమైనదని, అదేవిధంగా రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించుటకు సోషల్ మీడియాను వినూత్నంగా వినియోగించుటకు సంబంధించిన ఆలోచనలు తెలియజేయవలసిందిగా వారిని కోరారు.

ఈ కార్యక్రమంలో రవాణా అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సంపత్ కుమార్, రవికుమార్, మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పి. వి. వి. సాయి కుమార్, ప్రణీత్ కుమార్, ఉమామహేశ్వరరావు మరియు ఇతర శాఖ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.

RAJAMAHENDRAVARAM :

37th National Road Safety Month

Transport department officials visited Aditya Degree College here today as part of the National Road Safety Month celebrations.

District Transport Officer Suresh announced the selection of 25 student volunteers for the National Road Safety Month (NRSM)-2026 campaign. “They’ve been briefed extensively on the program’s agenda, goals, and objectives,” he said. Volunteers were urged to innovatively use social media to raise road safety awareness among the public.

The event saw participation from Motor Vehicle Inspectors Sampath Kumar, Ravikumar, Assistant MVIs P.V.V. Sai Kumar, Praneeth Kumar, Uma Maheswararao, and other officials alongside students.