The Desk… Rajamahendravaram : పండుగ సందర్భంగా అధిక ధరలకు ప్రైవేట్ బస్ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు➖R సురేష్ (జిల్లా రవాణా శాఖ అధికారి)

The Desk… Rajamahendravaram : పండుగ సందర్భంగా అధిక ధరలకు ప్రైవేట్ బస్ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు➖R సురేష్ (జిల్లా రవాణా శాఖ అధికారి)

🔴 తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణించడం వలన ఏర్పడే అధిక డిమాండ్ నేపథ్యంలో.. ప్రైవేట్ బస్సు యజమానులు అధిక ధరలకు టికెట్స్ అమ్మకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

▪️ ఇందులో భాగంగా ఈ రోజు అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులు ఆయా జిల్లాలో ఉన్న ప్రైవేట్ బస్సు యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు.

▪️ RTC నిర్దేశించిన ధరల కంటే 50% మాత్రమే గరిష్ట ధరగా నిర్ణయించి; అంత కంటే ఎక్కువ ధరలకు టికెట్స్ అమ్మే ప్రైవేట్ బస్సు యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ నిర్ణయించింది.

▪️ RTGS ద్వారా మరియు జిల్లాలో గల రవాణా అధికారులు అభి బస్, రెడ్ బస్ వంటి యాప్ ల ద్వారా బస్ ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అధిక ధరలు వసూలు చేసే బస్ యజమానులపై కేసులు పెడతామని తెలియజేశారు.

▪️ ప్రతీ ప్రైవేట్ బస్సు లోనూ రవాణా శాఖ హెల్ప్ లైన్ నెంబర్ 92816 07001 ను డిస్ప్లే చేయాలని బస్ యజమానులను ఆదేశించారు.

▪️ ఈ రోజు నుండి జనవరి 18వరకు అన్ని జిల్లాలో గల రవాణా అధికారులు ప్రైవేట్ బస్సులపై ఎన్ఫోర్స్మెంట్ చేస్తారని జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

హెల్ప్ లైన్ : 92816 07001

Strict Action Against Private Buses Charging Excess Fares During Sankranti.

Transport Department officials have warned of stringent measures against private bus operators hiking fares amid surging demand for Sankranti travel from distant areas to hometowns.

District Transport Officer R. Suresh announced that meetings were held today with bus owners across all districts. Fares are capped at 50% above RTC rates; violations will attract legal action. Officials will monitor via RTGS, Abhi Bus, and Red Bus apps, filing cases for overcharging.

Every private bus must display the helpline 9281607001. Enforcement drives run from today until January 18.