The Desk… Rajamahendravaram: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా..

The Desk… Rajamahendravaram: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా..

🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

ఈరోజు రాజమహేంద్రవరం లోని లారీ యూనియన్ ఆఫీస్ వద్ద కిమ్స్ హాస్పిటల్ మరియు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ బృందాల సహకారంతో ఉచిత కంటి పరీక్షలు మరియు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా లారీ అసోసియేషన్ డ్రైవర్లు, ఆటో యూనియన్ డ్రైవర్లు, మినీ గూడ్స్ అసోసియేషన్ సభ్యులకు ఉచిత కంటి పరీక్షలు మరియు ఉచిత రక్తపోటు పరీక్షలు నిర్వహించగా..దాదాపు 200 మంది పాల్గొన్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖకు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి.హెచ్. సంపత్ కుమార్, జి. రామ్ నారాయణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బి. ఉమా మహేశ్వర రావు, పి.వి.వి.డి. సాయి కుమార్, ఆర్‌టీఏ సిబ్బంది, ప్రభుత్వ వైద్యులు డా. మాధురి, ఎన్‌జీఓ మానవత రాజమండ్రి శాఖ అధ్యక్షుడు మురళి, సభ్యుడు బలరాం, కిమ్స్ హాస్పిటల్ వైద్యులు డా. సుబ్రహ్మణ్యం వారి బృందం, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Free Eye, Health Checks Mark Road Safety Month in Rajamahendravaram

In observance of National Road Safety Month, free eye and health screenings unfolded saturday at the Lorry Union office here, thanks to KIMS Hospital and Dr. Agarwal’s Eye Hospital teams.

Around 200 lorry association drivers, auto union members, and Mini Goods Association participants received complimentary eye exams and blood pressure checks, District Transport Officer R. Suresh said.

The event drew Motor Vehicle Inspectors C.H. Sampath Kumar and G. Ram Narayan; Assistant MVIs B. Uma Maheshwara Rao and P.V.V.D. Sai Kumar; RTO staff; government doctors like Dr. Madhuri; NGO Manavatha Rajamandri branch president Murali and member Balaram; plus medical teams from both hospitals.