ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు జిల్లా రవాణా శాఖ అధికారి సూచన.
ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్ట్ క్యారేజ్ (CC) బస్సు యజమానులు మరియు ఆపరేటర్లకు అవగాహన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా కమిషనర్ స్పష్టమైన ఆదేశాల మేరకు..
తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
రాజమహేంద్రవరంలో జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్ట్ క్యారేజ్ (CC) బస్సు యజమానులు మరియు ఆపరేటర్లతో ఈ రోజు సమగ్ర అవగాహన మరియు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ మాట్లాడుతూ :
▪️ ప్రయాణికులకు భద్రతే అత్యున్నత ప్రాధాన్యత కల్పించాలి.
▪️ప్రయాణికులతో బాధ్యతాయుతంగా, మర్యాదపూర్వకంగా మరియు స్నేహపూర్వకంగా వ్యవహరించాలి.
▪️ముందుగా ప్రకటించిన ప్రయాణ షెడ్యూల్ ని ఎటువంటి కారణాలతోనైనా రద్దు చేయడం లేదా వాయిదా వేయడం అనుచితమని, అటువంటి చర్యలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి దారితీస్తాయని తెలిపారు.
▪️వాహనాల నడపటంలో అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ పూర్తిగా నిషేధం.
▪️ప్రతి బస్సులో అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలి.
▪️సుదీర్ఘ ప్రయాణాల కోసం తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి.
▪️డ్రైవర్ విశ్రాంతి నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
▪️ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చి, అవి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉండే విధంగా చూడాలి.
▪️ప్రయాణికులు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సహాయం పొందేందుకు, ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ నంబర్- 9281607001 ను బస్సులో స్పష్టంగా, చదవదగిన రీతిలో ప్రదర్శించాలి.
▪️ప్రయాణికుల నుండి అధికంగా చార్జీలు వసూలు చేయడం పూర్తిగా నిషేధo.
▪️ప్రయాణీకుల నుండి చార్జీల పరంగా ఏదైనా ఫిర్యాదు అందినట్లైతే సంబంధిత ఆపరేటర్లు మరియు యజమానులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.
▪️వాహనాలకు సంబంధించిన పన్నులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు (FC), పర్మిట్లు, ఇన్సూరెన్స్ తదితర రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండాలి.
▪️డాక్యుమెంట్లలో ఏ చిన్న లోపం ఉన్నా.. కఠినచర్యలు.
▪️ప్రభుత్వ ఆదేశాలు పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యం తలెత్తినా..రవాణా శాఖ తనిఖీలను మరింత కఠినతరం చేసి, ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు.
▪️ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ప్రతి ఆపరేటర్ పూర్తి సహకారం అందించాలి.
➖R సురేష్ (జిల్లా రవాణా శాఖ అధికారి)
Passenger Safety Top Priority for Private Bus Operators
District Transport Department officials urged private travels and Contract Carriage (CC) bus owners and operators to prioritize passenger safety during a comprehensive awareness and review meeting here today.
Organized under the directives of Andhra Pradesh State Transport Commissioner, the session emphasized strict adherence to safety protocols. District Transport Officer R. Suresh addressed the gathering, stating, “Passenger safety must be the utmost priority.
“Key instructions included :
▪️Treat passengers responsibly, respectfully, and courteously.
▪️Avoid cancelling or delaying scheduled trips, which cause severe inconvenience.
▪️Prohibit overspeeding, rash, or negligent driving; appoint only experienced drivers.
▪️Mandate two drivers for long journeys and enforce rest rules.
▪️Equip every bus with functional fire safety equipment.
▪️Prominently display the government helpline 9281607001 for emergencies.
▪️Ban excess fare collection, with legal action for complaints.
▪️Keep vehicle taxes, fitness certificates (FC), permits, and insurance updated—any lapses invite strict penalties.
Suresh warned of intensified inspections and immediate action against violations. “Protecting lives is the government’s goal; operators must fully cooperate,” he added.
conducted meeting with CC bus operators – Instructions on not to enhance fares and precautions on safety issues
R. Suresh, District Transport Officer

