🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
ఈరోజు 09-01-2026 రాజమహేంద్రవరంలోని జె. ఎన్. రోడ్డులో గల “శశి విధ్యా సంస్థ” నందు ఆదిత్య డిగ్రీ కళాశాల కు చెందిన 30 మంది వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విస్తృతమైన రోడ్డు భద్రత విషయంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత, బాధ్యతాయుతమైన ప్రవర్తన గురించి అవగాహన కల్పించారు. దీనిలో భాగంగా ఈ క్రింద పేర్కొన్న కార్యక్రమాలను నిర్వహించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ :
వాలంటీర్లు రోడ్డు భద్రత, నియమాలు మరియు నివారణ చర్యల ముఖ్యాంశాలను వివరించే ప్రజెంటేషన్ అందించారు.
అవగాహన వీడియోలు :
ఆదిత్య డిగ్రీ కాలేజ్ వాలంటీర్లు రూపొందించిన రోడ్డు భద్రత వీడియోలను అన్ని విద్యార్థులకు ప్రదర్శించారు.
క్విజ్ పోటీ :
విద్యార్థులను ఆకర్షించడానికి మరియు వారి రోడ్డు భద్రత జ్ఞానాన్ని పరీక్షించడానికి ఇంటరాక్టివ్ క్విజ్ నిర్వహించారు.
ఫ్లాష్ -మాబ్ డాన్స్ :
వాలంటీర్లు సృజనాత్మకంగా రోడ్డు భద్రత (శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన) మరియు Seekh se Suraksha, Technology se Parivartan సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఫ్లాష్-మాబ్ డాన్స్ ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో శశి ఎడ్యుకేషనల్ సొసైటీ కు చెందిన సుమారు 300 మంది విద్యార్ధిని విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుండి వచ్చిన 30 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని అందరితో సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణాఅధికారులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి.హెచ్. సంపత్ కుమార్, మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లుబి ఉమా మహేశ్వర రావు,జి ప్రణీత్ కుమార్, శశి విధ్యా సంస్థ ప్రధాన ఉపద్యాయులు శ్రీహరి, ఆదిత్య డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫిసర్ & NSS కో ఆర్డినేటర్ జి.యస్. నాగేశ్వర రావు మరియు కళాశాల వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

