The Desk… Rajamahendravaram : గోదావరి తీరంలో పడవ పోటీలు..!!

The Desk… Rajamahendravaram : గోదావరి తీరంలో పడవ పోటీలు..!!

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి తీరంలో జల ఉత్సవం నిర్వహించారు. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో ఈ ఉత్సవం జరిగింది.

ఈ సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో మత్స్యకారులకు పడవ పోటీలు ఏర్పాటు చేశారు.

అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడారు. నదీ జలాలను పరిరక్షించుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు.