రహదారి భద్రత పై అవగాహన కార్యక్రమంలో రవాణా అధికారులు
🔴 రాజమహేంద్రవరం : ది డెస్క్ :

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం 2025 లో భాగంగా జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ సూచనల మేరకు శనివారం ది. 25-01-2025 న చైతన్య టెక్నోస్కూల్ బొమ్మూరు నందు విద్యార్థులకు మరియు డ్రైవర్స్, హెల్పర్స్, సూపర్ వైజర్స్ మరియు మేనేజ్ మెంట్ వారికి రహదారి భద్రత పట్ల అవగాహాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో సుమారు 300 మంది పాల్గొన్నారు.
1) స్కూలు మరియు కాలేజీ కి వచ్చు సిబ్బందిని హెల్మెట్టు ధరించి మాత్రమే వచ్చెట్టుగా నిభంధన విధించమని మరియు ప్రతి సంవత్సరం డిసెంబరు లేదా జనవరి నందు డ్రైవర్సుకు మరియు ఇతర సిబ్బందికి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించమని సూచించారు.
2) ప్రతి విద్యా సంస్థకు ఒక సైకిలాజికల్ కౌన్సిలర్‌ను నియమించుకోవాలని కొన్ని నిర్మాణాత్మకమైన సూచనలు చేసారు.

కార్యక్రమములో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ సి. హెచ్ సంపత్ కుమార్ .. ఎమ్. రవికుమార్ , జి రాంనారాయన్ , కె.చైతన్య సుమ , జి.రాధికా దేవి, పి.వి.వి సాయి కుమార్ , రోడ్ భద్రతా డాక్టర్ పి.మాధురి దేవి తదితరులు పాల్గొన్నారు.