🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో పన్ను బకాయిలు ఉన్నవి, ఫిట్నెస్ మరియు పర్మిట్ లేకుండా నిర్బంధించబడిన వాహనాలకు సంబంధించి బహిరంగ వేలం కార్యక్రమం సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ :
ఈ వేలం ప్రక్రియ పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించామని, వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 36 వాహనాలను వేలం వేయగా, వాటి ద్వారా రూ.10,06,600/- మొత్తాన్ని వసూలు అయిందని, ప్రభుత్వానికి రావలసిన బకాయిల వసూళ్లలో భాగంగా ఈ చర్యలు చేపట్టామని, వాహన యజమానులు తమ వాహనాలకు సంబంధించిన పన్నులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటి నిబంధనలను సమయానికి పూర్తిచేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రవాణా శాఖ తరఫున భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు మరియు చర్యలు భవిష్యత్తులో కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడంలో భాగంగా చేపడుతున్న ఈ విధమైన చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
Public Auction of Unpermitted Vehicles Nets Over ₹10 Lakh in Rajamahendravaram
In a transparent public auction organized by the District Transport Department, 36 impounded vehicles without taxes, fitness certificates, or permits fetched over ₹10.06 lakh, District Transport Officer R. Suresh announced on Monday.
Speaking on the occasion, Suresh emphasized that the process adhered strictly to government norms. “This is part of recovering pending dues for the government,” he said. He urged vehicle owners to renew taxes, fitness certificates, and permits on time, warning of legal action otherwise. The department plans ongoing checks to boost state revenue, seeking public cooperation.

