The Desk … Rajamahendravaram : అధిక లోడ్, మార్గదర్శకాలు ఉల్లంఘించిన రెండు ఇసుక లారీలు సీజ్

The Desk … Rajamahendravaram : అధిక లోడ్, మార్గదర్శకాలు ఉల్లంఘించిన రెండు ఇసుక లారీలు సీజ్

అపరాధ రుసుము కింద రూ.1,74,000 వసూలు➖ఆర్ సురేష్ (జిల్లా రవాణాశాఖ అధికారి)

🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

తూర్పు గోదావరి జిల్లాలో నియమాలను ఉల్లంఘించి అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు…

రవాణా శాఖ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో, అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను గుర్తించి సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో అధిక లోడ్ తో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను గుర్తించి, శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అందులో భాగంగా శనివారం రాజానగరం హైవే పరిధిలో, అదే విధంగా లాలా చెరువు సమీపంలో పరిమితికి మించి అధిక ఇసుక లోడ్‌తో వెళుతున్న రెండు లారీలను రవాణా అధికారులు పట్టుకుని సీజ్ చేశామన్నారు. అనంతరం సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి మొత్తం రూ.1,74,000 అపరాధ రుసుము విధించి వసూలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి తెలిపారు. సీజ్ చేసిన వాహనాలకు విధించిన అపరాధ రుసుము చెల్లించిన అనంతరం వాటిని విడుదల చేసినట్లు తెలిపారు.

పరిమితికి మించి ఇసుక రవాణా చేయడం వల్ల రహదారులపై ఇసుక జారిపడి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి ఘటనల వల్ల గతంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన, ఆసుపత్రి పాలైన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. అందువల్ల ఇసుక రవాణా చేసే వాహన యజమానులు, డ్రైవర్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.


ఇసుకను నిర్ణీత పరిమితి మేరకు మాత్రమే లోడ్ చేయాలని, అలాగే రహదారులపై ఇసుక చిందరగోళం కాకుండా తప్పనిసరిగా టార్పాలిన్ కప్పి రవాణా చేయాలని రవాణా శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.

Two Overloaded Sand Lorries Seized in Rajamahendravaram

Transport authorities seized two sand lorries for carrying excess loads in violation of guidelines, collecting Rs 1.74 lakh in fines, District Transport Officer R. Suresh said on Saturday. Acting on state government and Collector directives, officials intensified checks to enforce transport rules strictly.

The vehicles were nabbed on Rajanagaram highway and near Lala Cheruvu with sand exceeding limits. Cases were registered under relevant provisions, fines imposed and recovered, after which the lorries were released. “Field-level monitoring continues against overloaded sand transport,” Suresh stated.

Excess loads cause sand spillage on roads, risking accidents—past incidents have led to fatalities and injuries, officials warned. They appealed to owners and drivers: Load sand within prescribed limits and cover with tarpaulin to prevent spillage. Strict action will persist against violators.

This crackdown underscores Andhra Pradesh’s push for road safety amid rising violations in East Godavari.