The Desk … Rajamahendravaram : స్కూల్ ఆటోలపై ఆర్‌టీఏ అధికారుల కొరడా

The Desk … Rajamahendravaram : స్కూల్ ఆటోలపై ఆర్‌టీఏ అధికారుల కొరడా

🔴 తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్ పిల్లలను తరలిస్తున్న వాహనాలపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సోమవారం రవాణా శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి స్కూల్ పిల్లలను తరలిస్తున్న మొత్తం 11 ఆటోలపై కేసులు నమోదు చేయగా, అందులో 7 ఆటోలను సీజ్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు. ఆటోలలో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించటమేనని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి నిర్లక్ష్యపు రవాణా విధానాల వల్లే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ, అమూల్యమైన ప్రాణ నష్టం సంభవిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నుంచి జిల్లావ్యాప్తంగా తనిఖీలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. కొంతమంది ఆటో డ్రైవర్లు అతివేగంగా, నిర్లక్ష్యంగా పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుంటూ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

పిల్లలను స్కూల్‌కు పంపే తల్లిదండ్రులు కూడా వారి భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఇదే విషయంలో పాఠశాల యాజమాన్యానికి కూడా బాధ్యత ఉందని పేర్కొన్నారు.

అవగాహన సందేశం :

పరిమితికి మించి ఆటోలలో పిల్లలను స్కూల్‌కు పంపడం వల్ల జరిగే ప్రాణ నష్టం పూడ్చలేనిది. చిన్న నిర్లక్ష్యం ఒక కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగులుస్తుందని డి టి వో ఆర్ సురేష్ పేర్కొన్నారు.

మన బాధ్యత – మన పిల్లల భద్రత.

ఆటోలలో పరిమితికి మించి పిల్లలు ప్రయాణించే సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని రవాణా శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RTO Cracks Down on Overloaded School Autos in East Godavari

Transport authorities in East Godavari district conducted special checks on Monday, targeting vehicles ferrying schoolchildren. They booked cases against 11 autos for carrying students beyond capacity, seizing seven vehicles, District Transport Officer R. Suresh said.

“Overloading blatantly violates road safety norms, leading to fatal accidents and precious lives lost,” Suresh warned, lamenting reckless practices by some drivers who speed with excess passengers. He vowed intensified district-wide inspections, strict action, and seizures for violators.

Parents and school managements must prioritize child safety, he urged. “A small negligence can bring irreparable grief to families,” Suresh emphasized in an awareness message.

The Transport Department appealed to the public: Our responsibility—our children’s safety.