🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (NRSM)- 2026 కార్యక్రమంలో భాగంగా.. నగరంలో దివాన్ చెరువు నుండి బొమ్మూరు వరకు బైక్ ర్యాలీను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత పై అవగాహన మరియు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను రవాణా శాఖ అధికారులు కల్పించారు.

ఈ కార్యక్రమంలో, రవాణా అధికారులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి. హెచ్. సంపత్ కుమార్, ఎమ్. రవి కుమార్, జి. రామ్ నారాయణ, మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జి. ప్రణీత్ కుమార్, పి.వి.వి.డి.సాయి కుమార్ మరియు పోలీస్ సిబ్బంది, NHAI & సేఫ్ వే కన్సెషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

