🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

NH-16, NH-216A జాతీయ రహదారుల్లో ప్రమాదాలకు గురైన బ్లాక్‌స్పాట్లపై పోలీస్, NHAI అధికారులు సంయుక్త తనిఖీ నిర్వహించారు. రోడ్డు భద్రతను మెరుగుపరచేందుకు లైటింగ్, సైన్‌బోర్డులు, రోడ్ మార్కింగ్‌లు స్థాపనకు స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ అయ్యాయి. ఇన్‌చార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అధ్యక్షతన 17 అక్టోబర్ 2025కు జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో తీర్మానాల మేరకు 20 నవంబర్ న తనిఖీ జరిగింది. PIU-రాజమహేంద్రవరం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో దుర్గమ్మ ఆలయం, కలవచెర్ల జంక్షన్, GSL మెడికల్ కాలేజీ, GIET, ఏవప్పారావు రోడ్, జేఎన్ రోడ్, ITC సెంటర్‌లో సైన్‌బోర్డులు, రుమేళాలు, సర్వీస్ రోడ్లు, లైటింగ్ ఏర్పాటు పూర్తి అని తెలిపారు.
గామన్ బ్రిడ్జి వై-జంక్షన్‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ప్రారంభమైంది. అటవీ ప్రాంతంలో 9 డబుల్ ఆర్మ్ సోలార్ లైట్లు, మినర్వా స్కూల్, తూర్పుగోనగూడెం, చెక్రద్వారబండం, నన్నయ యూనివర్సిటీ, ఆటోనగర్‌లో కొత్త లైటింగ్‌కు బిడ్డింగ్ దశ. మోరంపూడిలో డిసెంబర్ 16 నాటికి పనులు పూర్తి.శాఖల సమన్వయంతో ప్రజా భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని అధికారులు హామీ. సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేష్, R&B EEలు, DSP, ట్రాఫిక్ CIలు పాల్గొన్నారు.

