The Desk…Rajamahendravaram : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్ధులు దుర్మరణం

The Desk…Rajamahendravaram : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్ధులు దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా : రాజమహేంద్రవరం : దివాన్ చెరువు : THE DESK :

దివాన్ చెరువు రహదారి ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివాన్‌చెరువు వైపునకు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని, దాని వెనుక వస్తున్న లారీ అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి ప్రవీణ్‌కుమార్‌ (20), పల్నాడు జిల్లాకు చెందిన చింతా కార్తీక్‌ (19)గా గుర్తించారు. వీరిద్దరూ గైట్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.