🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని “తక్కువ నీటి వినియోగం – దుర్గంధం లేని టాయిలెట్స్” ఏర్పాటుపై మరోసారి ప్రొఫెషనల్ టీంతో శనివారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ లు సమావేశం నిర్వహించారు.
స్ధానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం మేసర్స్ రోసారి ప్రొఫెషనల్ తో “వాటర్ లెస్ – ఒడోర్ లెస్ “ ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హేమంత్, సత్యనారాయణ వివరించారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ స్వచ్చ అవాస్ కార్యక్రమం కింద విజన్ 2047 దిశగా అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ఇదే క్రమంలో రానున్న గోదావరీ పుష్కరాలను అత్యంత సమర్ధవంతంగా చేపట్టడం కోసం అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు .
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ… స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్ ఏర్పాటు చేసే క్రమంలో ప్రకృతి వనరులను సంరక్షించే దిశగా తక్కువ నీటి వినియోగం – వాసన లేని టాయిలెట్స్ ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ఆలోచన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టడం జరుగుతుందన్నారు.
ఇందుకోసం కంపెనీ ప్రతినిధులతో ప్రాజెక్ట్పై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. మోడల్ టాయిలెట్ పనితీరు ను పరిశీలించినట్లు తెలిపారు. శానిటేషన్ నిర్వహణ వ్యవస్థ ను ఇటువంటి ప్రాజెక్ట్స్ చేపట్టడం ద్వారా సమర్ధవంతంగా సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ స్వభావ రీత్యా రూపొందించిన అంశాలని అంశాల వారీగా వివరించారు.
నేటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు రూపొందించబడిన వినూత్న పరిష్కారాల ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రకృతి వనరుల సుస్థిరతను కాపాడడానికి ఈ ప్రాజెక్ట్ రూపొందించడం జరిగిందన్నారు. అందుకు సంబంధించి తాము ప్రతిపాదించిన అంశాలకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఆదిశలో కొన్ని కీలకమైన అంశాలని సమావేశం దృష్టికి తీసుకు రావడం జరిగింది.

మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ MPకి వివరిస్తూ..
ప్రకృతి వనరుల సంరక్షణ : వాసన లేని మరియు నీరు లేని మూత్ర విసర్జన పరికరం యొక్క పరిశుభ్రతను పెంచడమే కాకుండా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటుగా స్థిరమైన పారిశుద్ధ్య నిర్వహణా సామర్ధ్యం పెంచడం ఈ ప్రాజెక్ట్ లో ప్రథాన అంశం అని మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ ఎంపీకి వివరించారు.
కంపెనీ ప్రతినిధులు : ఇటువంటి వినూత్న ప్రతిపాదనలు ద్వారా నదులు, చెరువులు మరియు స్విమ్మింగ్ పూల్స్ వంటి నీటి వనరులను పునరుద్ధరించడానికి మరియు శుద్ధి చేయడానికి, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను మరియు పరిశుభ్రమైన వాతావరణాలను ప్రోత్సహించడానికి అనువైన ప్రతిపాదన అని పేర్కొన్నారు . స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని మరియు సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
వాణిజ్య మరియు పర్యావరణ సాధ్యతను నిర్ధారించేటప్పుడు సమర్థవంతమైన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఈ ప్రాజెక్ట్ సమర్థవంత మైన పనితీరు నిదర్శనం అని కంపెనీ ప్రతినిధులు వివరించారు .ఈ కార్యక్రమంలో RMC ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు