The Desk…Prattipadu : డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు

The Desk…Prattipadu : డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు

  • ఆరోగ్యవంతమైన సమాజానికి యువత సహకరించాలి
  • సిఐ సూర్యఅప్పారావు, ఎస్ఐ లక్ష్మీ

🔴 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు :

ఆరోగ్యవంతమైన సమాజాని యువత సహకరించాలని బ్రో…డ్రగ్స్ వద్దు సైకిల్ తొక్కు అంటూ సిఐ, ఎస్ఐలు సూర్య అప్పారావు, లక్ష్మీ పిలుపునిచ్చారు.

ఆదివారం ప్రత్తిపాడులో మాధక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సిఐ బి.సూర్యఅప్పారావు, ఎస్ఐ లక్ష్మి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ ను ఏర్పాటుచేసి డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తుందన్నారు.ఈగల్ నేత త్వంలో జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న సైకిల్ ర్యాలీ ఎంతో ప్రాముఖ్యత కలిగిస్తుందని చెప్పారు.

అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ భాగస్వాములు కావాలంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాదకద్రవ్యాలకు బానిసలు కాకూడదంటూ యువతకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు పోలీసులు, పెదసంఖ్యలో యువత పాల్గొన్నారు.