The Desk…Prattipadu : ప్రత్తిపాడు పీఎస్ లో వందేమాతరo గేయానికి జాతీయ గేయాలాపన

The Desk…Prattipadu : ప్రత్తిపాడు పీఎస్ లో వందేమాతరo గేయానికి జాతీయ గేయాలాపన

🔴 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు :

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ కార్యాలయంలో ప్రత్తిపాడు సిఐ బి. సూర్య అప్పారావు ఆధ్వర్యంలో.. వందేమాతరం గేయానికి జాతీయ గేయాలపన చేశారు.

వందేమాతరంకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు మండలాల పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బందితో వేడుకలు నిర్వహించి, భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి, వందేమాతరం గేయాన్ని ఆలపించారు.

సందర్భంగా సీఐ సూర్య అప్పారావు మాట్లాడుతూ..

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ పోలీస్ పరిధిలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జాతీయగీతం ఆలాపించడం జరిగిందన్నారు..

కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మికాంతం, ఏలేశ్వరం ఎస్సై రామలింగేశ్వరరావు, అన్నవరం ఎస్సై శ్రీహరి రాజు,రౌతులపూడి ఎస్సై వెంకటేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..