The Desk…Prattipadu : పట్ట పగలు చోరీల చేసే ఇద్దరు నేరస్తులు అరెస్ట్

The Desk…Prattipadu : పట్ట పగలు చోరీల చేసే ఇద్దరు నేరస్తులు అరెస్ట్

🔴 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు మండలం : ది డెస్క్ :

బంగారు నగలు, వెండి ఐటమ్స్ , ప్లాటినం రింగ్, మోటార్ బైక్, ఐరన్ కటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

పెద్దాపురం DSP – ప్రత్తిపాడు సిఐ ఆధ్వర్యంలో..

వివరాల్లోకి వెళితే..

వారం రోజుల క్రితం ధర్మవరం గ్రామంలో జగనన్న కాలనీలో గాలి తలుపులయ్య అనే వ్యక్తి ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితులైన ఇద్దరు నేరస్తులను.. పక్కా సమాచారం మేరకు ప్రతిపాడు గ్రామంలోని పాదలమ్మ గుడి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి, వారి వద్ద నుండి బంగారు నగలు, వెండి వస్తువులు, మోటార్ బైక్, ఐరన్ కటింగ్ మిషన్, ప్లాటినం ఉంగరం రికవరీ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన పోలీసులు.

రికవరీ ఐటమ్స్ :

బంగారు వస్తువులు -247 grams
వెండి వస్తువులు – 90 grams
ప్లాటినం రింగ్ – 3 grams

ఈ సందర్భంగా వారం రోజులలో కేసును చేదించి, సొత్తు రికవరీ చేసినందుకు గాను ప్రత్తిపాడు సిఐ (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్) సూర్య అప్పారావు, ఎస్సై, మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు.