The Desk….Prattipadu : ప్రత్తిపాడులో పెద్దపులి ప్రత్యక్షం..‼️

The Desk….Prattipadu : ప్రత్తిపాడులో పెద్దపులి ప్రత్యక్షం..‼️

🔴 BIG NEWS : BIG TIGER 🐅 : UPDATE : THE DESK NEWS :కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు నియోజకవర్గo :

ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు నిర్ధారించిన అటవీశాఖ అధికారులు..

ఆదివారం ప్రత్తిపాడు శివార్లలో ఆవును ఓ జంతువు చంపి తినగా… దానిని గుర్తించే క్రమంలో పాదముద్రల నమూనాల ఆధారంగా అధికారులు పెద్దపులిగా గుర్తింపు..

ప్రస్తుతం పెద్దపులి పెదబాపన్నదార పరిసర అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం..

నియోజకవర్గంలోని శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాల్లోని సమీపాన ఉన్న 20 గ్రామాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..

ఆవు కళేబరం పరిసరాల్లో నాలుగు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు..

2022 మేలో 37 రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచరించింది. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం, తుని మండలాల్లో సంచరించగా… ఇటీవల సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ వరకు సుమారు 45 రోజులు రాజమహేంద్రవరం, కడియం, ఆలమూరు, రావులపాలెం పరిసర ప్రాంతాల్లో కలియ తిరిగిన పెద్దపులి.

www.thedesknews.net