- హాజరైన టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు
- నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో రంపచోడవరం ఏపీడీ శ్రీనివాస విశ్వనాధ్, శైలజ దంపతులు
🔴 కాకినాడ జిల్లా : పిఠాపురం/ఉప్పాడ కొత్తపల్లి : ది డెస్క్ :
వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పట్టుశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజాపంతుల నాగేశ్వరావు పద్మావతి దంపతుల తనయుడు సాయి ప్రవీణ్ బాబు, జాహ్నవిల వివాహ వేడుకలు ఉప్పాడ కొత్తపల్లి స్థానిక సురక్ష పేలాస్ కల్యాణ మండపంలో ఘనంగా జరిగాయి.
నూతన వధూవరులను ఆశీర్వదించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు, రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులు, వస్త్రవ్యాపారులు, వివాహ వేడుకలకు హాజరు కాగా.. వధూవరులను దీవించిన వారిలో రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, రంపచోడవరం డ్వామా ఏపీడీ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ శైలజ దంపతులు ఉన్నారు. కార్యక్రమలో ఏర్పాటు చేసిన ఉత్తరాది, దక్షిణాది వంటకాలు అందరి మన్ననలు పొందాయి.
వివాహానికి హాజరైన వారిలో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా సంజీవరావు, ఉపాధ్యక్షులు శీరం లక్ష్మణ ప్రసాద్, పొన్నగంటి సత్యనారాయణ, రాధాకృష్ణ, బీజేపీ జిల్లా మహిళా కార్యదర్శి మోహిని, చేనేత నాయకులు సత్య, కళ్యాణి, స్థానిక కూటమి నాయకులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రముఖ వస్త్రవ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.