The Desk…Pedapadu : పునరావాస కేంద్రాలలో డీపీఓ విశ్వనాధ్ వసతులు పరిశీలన — మండలస్థాయి అధికారులతో సమీక్ష

The Desk…Pedapadu : పునరావాస కేంద్రాలలో డీపీఓ విశ్వనాధ్ వసతులు పరిశీలన — మండలస్థాయి అధికారులతో సమీక్ష

ఏలూరు జిల్లా : పెదపాడు : THE DESK :

స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం, పారిశుధ్య నిర్వహణ ప్రాధాన్యత అంశాలు..

పశువైద్య శిభిరాలు సక్రమంగా నిర్వహించాలని సూచన..

భారీ వర్షాల కారణంగా పెదపాడు మండలంలో గోగుంట, వడ్డిగూడెం, కొనికి పంచాయతీ పరిధిలో పలు గ్రామాలు ముంపునకు గురికావడం గుర్తించడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి మరియు ప్రత్యేక అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు మేరకు ముంపునకు గురైన గ్రామాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పించడం జరిగిందనన్నారు.

ప్రస్తుతం 4 వందల మంది నిర్వాసితులు పునరావాస కేంద్రాల వద్ద ఉన్నారని వారందరికీ అల్పాహారం, భోజనం, త్రాగునీరు, వైద్య సేవలు కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటు చేశామన్నారు.

వసంతవాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ పరిశీలించి నిర్వసితులతో మాట్లాడి భరోసా నింపారు. అనంతరం మండలస్తాయి అధికారులతో భారీ వర్షాలపై సమీక్షించారు.

ఈ సందర్బంగా DPO మాట్లాడుతూ… పశువైద్య శిభిరాలు సక్రమంగా నిర్వహించాలని పశువైద్య అధికారిని సంధ్యను ఆదేశించారు. మండలంలో త్రాగునీరు ఓ.హెచ్.ఆర్ ట్యాంకుల వద్ద ఉన్న ప్రధాన వాల్వ్ ఛాంబర్సులో ఉన్న వర్షపు నీరు కలుషితమైనందున పూర్తిస్థాయిలో అన్ని ఛాంబర్సులో ఉన్న నీటిని తోడించాలని విస్తరణ అధికారి సూర్య కుమార్ ను ఆదేశించారు.

గర్భిణీస్త్రీలు నెలలు నిండితే వైద్యులను సంప్రదించి ముందస్తుగా ఆసుపత్రికి తరలించాలని ఐ.సి.డి.యస్ సూపర్వైజర్ ఫాతిమను ఆదేశించారు. ప్రజలు వ్యాధులు బారిన పడకుండా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, క్లోరినేషన్ అయిన తర్వాతే త్రాగునీరు అందించాలని పంచాయతీ కార్యదర్సులను ఆదేశించారు. సమీక్ష అనంతరం వైద్య శిభిరాన్ని పరిశీలించారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో కమీషనర్ పంచాయతీ రాజ్ కార్యాలయం నుంచి పారిశుధ్య నిర్వహణకు సంబంధించి జిల్లా పరిశీలుకునిగా వచ్చిన వెంకట్ ప్రసాద్ సమీక్షలో పాల్గొనగా, తాసిల్దార్ ప్రసాద్, మండలస్తాయి అధికారులు పాల్గొన్నారు.