The Desk…Pamidimukkala : VRO సంతకాల పోర్జరీ..!!

The Desk…Pamidimukkala : VRO సంతకాల పోర్జరీ..!!

  • VRO సంతకాల పోర్టరీని ధృవీకరించిన ఎ.పి.స్ట్రేట్ ఫోర్సెనిక్ సైన్స్ ల్యాబ్ జాయింట్ డైరెక్టర్.
  • సంతకాల పోర్జరీని చేసింది ఎవరో కనిపెట్టలేని పమిడిముక్కల పోలీసులు
  • కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని పమిడిముక్కల పోలీసులు

హోం శాఖ ముఖ్య కార్యదర్శికి పిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త “జంపాన “

కృష్ణాజిల్లా : పమిడిముక్కల మండలం : ది డెస్క్ :

సాక్ష్యాత్తు..పమిడిముక్కల తహశీల్దారుకట్టా వెంకట శివయ్య, వి.ఆర్వో సంతకాలు పోర్జరి జరిగిందని పిర్యాదు చేసి నాలుగున్నర సం||రాలు గడుస్తున్నా…మంటాడ గ్రామ రెవిన్యూ అధికారి కె. మారుతి చైతన్య, సాయిబాబుల సంతకాలు పోర్జరీ జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఫోర్సెనిక్ సైన్స్ ల్యాబ్రేటరి జాయింట్ డైరెక్టర్, సైంట్విట్ ఆఫీసర్ ఎస్.వి. బాలసుబ్రమణ్యం ది.25.11.2022న ఉయ్యూరు 10వ జూనియర్ సివిల్ జడ్జి. కమ్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కి తన నివేదికను సమర్పించి 3సం॥ రాలు గడుస్తున్నా.. పమిడిముక్కల పోలీసులు ఇప్పటి వరకు వి.ఆర్వో సంతకాలను పోర్జరీ చేసిన నిందితులను గుర్తించకపోవటం, “కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని ” చందంగా తయారైంది.

వి.ఆర్వో సంతకాలు చేసిన ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ భూములను ఉయ్యూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో డాక్యుమెంటలను తయారు చేయటం జరిగింది. ఈ డాక్యుమెంట్ తయారీలను మంటాడ గ్రామానికి చెందిన ప్రశ్నించే పార్టీ నాయకుడు గుర్రాల రాకేష్, కంకిపాడుకు చెందిన మాజీ సబ్ రిజిస్టర్ జె. వెంకటేశ్వరరావులు కలసి సంయుక్తంగా ఉయ్యూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయములో అనేక డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. సబ్ రిజిష్ట్రారుకు ఈడాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయించిన బ్రోకర్ల మధ్య లక్షలాధిరూపాయలు చేతులు మారాయి.

పమిడిముక్కల పోలీసుల పనితీరుపై, వి.ఆర్వో. సంతకాల పోర్జరీ కేసు దర్యాప్తు విషయమై ది.08.12.2025న హోం శాఖ ముఖ్యకార్యదర్శి Sri.KUMAR VISHWAJEET,L.P.S, కి సామాజిక కార్యకర్త, గురజాడ మాజీ సర్పంచ్ “జంపాన శ్రీనివాస గౌడ్” కృష్ణాజిల్లా, ఎస్.పి..వి.విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో, స్వీయ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరగాలని పిర్యాదు చేశారు.