The Desk…Palnadu : జర్నలిస్టులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలి

The Desk…Palnadu : జర్నలిస్టులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలి

పల్నాడు జిల్లా : THE DESK :

జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ కు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నాయకులు వినతి పత్రం అందజేత

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్.

ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ ను కలసి జర్నలిస్టులపై దాడులు అరికట్టి రక్షణ కల్పించాలని, జర్నలిస్టుపై దాడులకు నివారణకు కఠిన చట్టాలు అమలు చేయాలని వినతి పత్రాన్ని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు అందజేశారు.

ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై మీరు చేసే అవిశ్రాంత పోరాటానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎన్.ఎ.ఆర్.ఎ నాయకులకు తెలియచేసారు. పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది.

ఆ దేశంలో కానీ, సమాజంలో కానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమన్నారు. జర్నలిస్టులపై దాడులు నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని తెలియజేశారు. అనంతరం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ బండి సురేంద్రబాబు పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ కు శాలువాతో సన్మానించారు.

పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ ను కలిసిన వారిలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు, ఉమెన్స్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ మద్దినేని మానస, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు మక్కెన సురేంద్రబాబు, ఖాదర్ వలీ, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సురేష్, ముక్తార్, నల్లూరి ప్రదీప్ కుమార్, జయరాజు, పి వెంకటేశ్వర్లు, కోటయ్య, జయప్రకాష్ లు ఉన్నారు.