The Desk… Palakollu : సంక్రాంతి పండుగ సందర్భంగా పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు➖ మద్దాల శ్రీనివాస్ (SHO EXCISE DEPT)

The Desk… Palakollu : సంక్రాంతి పండుగ సందర్భంగా పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు➖ మద్దాల శ్రీనివాస్ (SHO EXCISE DEPT)

🔴 పగో : పాలకొల్లు : ది డెస్క్ :

పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, అక్రమ మద్యం విక్రయాలు, రవాణా, వినియోగం అరికట్టేందుకు పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.

సందర్భంగా ఎక్సైజ్ మద్దాల మాట్లాడుతూ..

NDPL, DPL మరియు నకిలీ మద్యం కేసుల్లో గతంలో ఇన్వాల్వ్ అయిన పాత ముద్దాయిలపై నిఘా పెంచి, మొత్తం 20 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, వీరికి చట్టాలపై అవగాహన కల్పిస్తూ, తిరిగి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించామని..
ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పండుగకి వచ్చేవాళ్ళు చట్టం గురించి తెలియక అక్కడి NDPL మద్యం తీసుకువస్తే, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు ఉంటాయని..NDPL మద్యం రవాణా చేస్తూ పట్టుబడినట్లయితే, సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని మరియు పండుగల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలు లేదా రవాణా గురించి సమాచారం ఉన్నట్లయితే, ప్రజలు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Palakollu Excise Station Tightens Grip on Illegal Liquor Ahead of Sankranti

In anticipation of Sankranti festivities, Palakollu Excise Station has launched stringent measures to curb illegal liquor sales, transport, and consumption within its jurisdiction, Station House Officer M. Srinivasa announced.

Speaking to the media, Srinivasa revealed that 20 repeat offenders involved in prior NDPL, DPL, and counterfeit liquor cases have been bound over, counseled on laws, and warned against recidivism. “Out-of-state visitors unaware of Andhra Pradesh Excise Act risks face vehicle seizures and cases if caught transporting NDPL liquor,” he cautioned.

These steps aim to ensure public safety, peace, and health during celebrations. Citizens are urged to report suspicious activities to excise officials.