The Desk…Palakollu : “విశ్వ” కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

The Desk…Palakollu : “విశ్వ” కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

🔴 పగో జిల్లా : పాలకొల్లు : ది డెస్క్ :

డిప్యూటీ కమిషనర్ ఏలూరు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్, భీమవరం వారి ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు గంజాయి, నాటుసారా, డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పాలకొల్లు విశ్వ కళాశాలలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సందర్భంగా పాలకొల్లు ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ మాట్లాడుతూ..

గంజాయి ఇతర మాదకద్రవ్యాలు వినియోగించడం వలన మానవుల ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై చెడు ప్రభావాలను మరియు సమాజంపై దుష్ప్రభావాలు కలుగజేస్తాయని విద్యార్థులకు వివరించారు.

ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్, మరియు ఎక్సైజ్ ఎస్.ఐ., మహేష్ మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ANTI-DRUGS AWARENESS SESSION AT VISHWA COLLEGE

Under directives from Eluru Deputy Commissioner, Assistant Commissioner (Enforcement), and Bhimavaram District Prohibition & Excise Officer, an anti-drug awareness program was held today at Palakollu Vishwa College. Organized by the Prohibition & Excise Department as part of the action plan, it targeted ganja cultivation and a drug-free Andhra Pradesh.

Excise CI Maddala Srinivas warned students that ganja and narcotics harm human health, mental state, and society.

College principal, Excise SI Mahesh, staff, and students attended.