విజయవాడ, (ద డెస్క్ న్యూస్) : విజయవాడలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దిన్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ చౌదరి పలు షాపుల పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మొహిద్దిన్ మాట్లాడుతూ.. ప్రజలు, వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిస్తే సహించేది లేదన్నారు. అటువంటి వారు ఎవరైనా తారసపడితే తమకు తెలియపరచాలన్నారు.
