The Desk …Nidamarru : క్రిస్మస్ ఆరాధన…!!

The Desk …Nidamarru : క్రిస్మస్ ఆరాధన…!!

ఏలూరు జిల్లా : నిడమర్రు మండలం : నిడమర్రు : THE DESK NEWS :

ఈసీఐ చర్చి వారు ఈరోజు అనగా 25-12-2024 రాత్రి 7 గంటలకు క్రిస్మస్ ఆరాధనలో భాగంగా స్థానిక ఈ సి ఐ చర్చి నందు క్రిస్మస్ ఆరాధన ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు.. వంగా రఘు (గణపవరం మండల జనసేన పార్టీ ఇన్చార్జి) పొత్తూరి వాసురాజు (క్షత్రియ చైర్మన్) మరియు చెల్లాంశెట్టి సూరిబాబు (నీటి సంఘం ప్రెసిడెంట్) ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఈసీఐ చర్చి పాస్టర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

కావున విశ్వాసులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ..క్రీస్తు యొక్క బోధన విని… ఆయన చూపిన ప్రేమ, దయ మార్గాలను అనుసరించి నడవాలని క్రిస్మస్ ఆరాధన దేవునికి మహిమకరంగా జరగాలని తెలిపారు.