🔴 తూగో జిల్లా : నిడదవోలు : ది డెస్క్ :
ఉత్తీర్ణులకు పట్టా ప్రధానం
అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
పట్టణంలోని రామ్ నగర్ లో గల నారాయణ ఒలింపియాడ్ స్కూల్ నందు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్ ప్రసాద్ మాట్లాడుతూ :
విద్యార్థులు నిరంతరం తమ చదువుల పట్ల పోరాట ప్రతిభను కనబర్చి శ్రద్దగా విద్యను అభ్యసించే క్రమంలో ప్రాత్సాహం కల్పించేందుకు ఈ స్నాతకోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు.
సంస్థల క్లస్టర్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ మాట్లాడుతూ :
వాస్తవిక పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ఏరంగంలోనైనా అందెవేసిన చేయగా మార్చడానికి వీలుగా విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించడానికి స్నాతకోత్సవము నిర్వహిస్తున్నామని అన్నారు.
పట్టా ప్రధానం :
అండర్ కిండర్ గార్డెన్(యూ.కె.జి) నుండి ఒకటవ తరగతి విద్యను అభ్యసించడానికి వెళ్లే చిన్నారులకు ప్రత్యేకంగా స్నాతకొత్సవము నిర్వహించారు. విద్యార్థులు చదివిన తరగతిలో ఉత్తీర్ణత సాధించినట్లుగా అర్హతపత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేతులమీదుగా పట్టా ప్రధానం చేశారు.
కళ్ళకు కట్టినట్లు పేరెంట్స్ కు వివరించిన ఉపాధ్యాయులు :
విద్యార్థులు తరగతి గదిలో క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తున్న విధానమును మరియు సహ విద్యార్థులతో మెలిగిన కొన్ని సందర్భాలను విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు కళ్ళకు కట్టినట్లు విచ్చేసిన తల్లిదండ్రులకు వర్ణించగా… తల్లిదండ్రులు ఆనంద భరితులయ్యారు.
ఈ సందర్భంగా ప్రి ప్రైమరీ కో- ఆర్డినేటర్ రాణి ప్రదీపిక మాట్లాడుతూ :
డిగ్రీ పట్టా తీసుకొని వాస్తవ ప్రపంచంలో ఉద్యోగ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.
ఈ సందర్భంగా సంస్థల డి.జి.ఎం.రామిరెడ్డి మాట్లాడుతూ :
నారాయణ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు మరియు ఎటువంటి పోటీపరిక్షలనైనా దృఢంగా ఎదుర్కొని విజయం సాధించేందుకు నారాయణ విద్యా విదానం రూపొందిందని, తల్లిదండ్రులకు తమపిల్లలు చిన్ననాటినుంచి విజయాలు సాధించాలని కోరిక ఉంటుందని, ఆకోరికలకు సమాధానం ఒక్క నారాయణ పాఠశాల మాత్రమే అని ఆయన అన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు :
ఈకార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను అలరించాయి. కార్యక్రమంలో అందంగా తీర్చిదిద్దినందుకు పాఠశాల ప్రి- ప్రైమరీ ఇంచార్జి విజయకుమారి, ప్రి ప్రైమరీ అధ్యాపక బృందం గౌతమి,దివ్య, శ్యామల, తేజశ్రీ, చంద్రావతి, ఫణి కుమారి, శృతి మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందిని యాజమాన్యం తరుపున ఆర్ అండ్ డి హెడ్ మరియా పాట్రిక్ ప్రశంసించారు.
Narayana Olympiad School Celebrates Pre-Primary Graduation with Pomp
Degrees Awarded to Graduates
Kids’ Cultural Shows Dazzle
Narayana Olympiad School in Ram Nagar hosted a grand pre-primary graduation ceremony for its students, marking a milestone from UKG to Class 1. The event, organized by school management, featured certificate distributions, inspiring speeches, and captivating cultural performances that enthralled parents.
School Principal Ram Prasad emphasized the annual tradition: “We conduct this graduation to motivate students to persistently excel in studies with dedication and fighting spirit.”
Cluster Principal Satyanarayana highlighted its purpose: “In a competitive world, this event instills a competitive mindset, equipping our children to turn any challenge into opportunity.”
Certificates symbolizing successful completion were handed over by the principal to the young graduates, amid cheers from proud families.
Teachers vividly recounted classroom discipline, peer interactions, and teaching moments to parents, leaving them delighted and reassured.
Pre-Primary Co-Coordinator Rani Pradeepika drew a parallel: “Just as one pursues a degree for real-world jobs, this ceremony prepares our tiny tots for their educational journey.”
Institutions’ DGM Ramireddy praised the Narayana education system: “Designed to encourage students from childhood to face any competition confidently and succeed. Parents dream of early victories for their kids—Narayan School is the answer.”
The highlight was the students’ cultural programs, which mesmerized attendees. School management, through R&D Head Maria Patrick, commended Pre-Primary In-Charge Vijayakumari, teachers Gautami, Divya, Shyamala, Tejashri, Chandravati, Phani Kumari, Shruti, and support staff for their stellar execution.

