ఏలూరు జిల్లా, ముదినేపల్లి, (ద డెస్క్ న్యూస్) : మండలంలోని గుడివాడ – భీమవరం జాతీయ రహదారి, గురజ – మచిలీపట్నం, ముదినేపల్లి – బంటుమిల్లి రహదారులపై స్థానిక పోలీసులు శనివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు డిఎస్పి డి. శ్రావణ కుమార్ మరియు కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కృష్ణకుమార్ పర్యవేక్షణలో ముదినేపల్లి ఎస్సై డి. వెంకట్ కుమార్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. తనిఖీలలో సిబ్బంది పాల్గొన్నారు.
