ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి నంగెడ్డ శివాజీ తండ్రిగారైన నంగెడ్డ హుళక్కి రావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం మండలంలోని గోనెపాడు గ్రామంలో ఉంటున్నటువంటి నంగెడ్డ శివాజీ గృహానికి బిసి నాయకులు వెళ్లి ఆయనను పరామర్శించారు. ముందుగా నాయకులు నంగెడ్డ హుళక్కి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి నివాళులర్పించారు. శివాజీ ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. పరామర్శించిన వారిలో బొర్రా చలమయ్య, బికెయమ్ నాని, గంగునేని వరప్రసాద్, పూల రాజీ, బోయిన రామకృష్ణ, బలే చిరంజీవి, కట్ట నాగరాజు తదితరులు ఉన్నారు.