
ఏలూరు జిల్లా, కైకలూరు, (ద డెస్క్ న్యూస్) : భారత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం 9వ వర్థంతి కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షులు కొండ్రెడ్డి చిట్టమ్మ అధ్యక్షతన కైకలూరు గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమానికి కైకలూరు గ్రామ సర్పంచ్ దానం మేరీ నవ రత్న కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మానవతా స్వచ్చంద సేవాసంస్థ సభ్యులు పెదబాబు, గుర్రం శ్యామ్, గోపి, శీలం కృష్ణవేణి, గాలిబ్ బాబు, విఠల్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.