అమరావతి, NTR జిల్లా (ద డెస్క్ న్యూస్) : జోగి – జోగి రాసుకుంటే ఏదో బూడిద వచ్చిందట… కానీ ఇక్కడ మాత్రం భూములు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..!!
10 కోట్ల స్థిరాస్తి కబ్జా వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర..‼️
ACB.. CID విచారణలో వెలుగులోకి..‼️
సర్వే నంబరు మార్చి.. అగ్రిగోల్డ్‌ను ఏమార్చి.. భూములు కొట్టేశారు. ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి, వాటిని సర్వే నంబర్లు మార్చి విక్రయించడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. అంబాపురంలో జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసి ప్రహరీ కట్టిన అగ్రిగోల్డ్ భూమి. ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి, వాటిని సర్వే నంబర్లు మార్చి విక్రయించడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావులు అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకుని ఇతరులకు విక్రయించిన విషయం తెలిసిందే. దీనిపై 2023లోనే ఫిర్యాదులు అందినా.. అధికారులు విచారణ చేయకుండా తొక్కి పెట్టారు. సర్వే చేయకుండానే చేసినట్లు నివేదికలు ఇచ్చేసి, రికార్డులు తారుమారు చేశారు. తహసీల్దారు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్వీయ సవరణ పేరుతో సర్వే నంబరు మార్చేసి, రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం.. ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 2,160 గజాల స్థలం కొని.. తిరిగి వెంటనే విక్రయించి సొమ్ము చేసుకున్న విషయం తెలిసిందే. సర్వే నంబరు 88లోని భూమి కొన్న జోగి కుటుంబం తర్వాత దాన్ని సర్వే నంబరు 87గా మార్చుకుని విక్రయించింది. దీనిపై ఫిర్యాదు చేసినా వైకాపా ప్రభుత్వ హయాంలో ఎవరూ స్పందించకపోగా.. రెవెన్యూ అధికారులు స్వాధీన పత్రం కూడా ఇచ్చేశారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఏసీబీ, సీఐడీ దర్యాప్తులో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఆర్‌ఎస్ నంబరు 88లో 3,800 గజాల స్థలాన్ని 2014లో మహాలక్ష్మీ ప్రాపర్టీస్ (అడుసుమిల్లి మోహన్‌రామదాసు) కొన్నారు. 2022లో దీనిలో దస్తావేజు నంబరు 7592 ద్వారా జోగి వెంకటేశ్వరరావుకు 1,086 గజాలు, 7589, 7590, 7591 మూడు దస్తావేజుల ద్వారా జోగి రాజీవ్‌కు 1,074 గజాలు విక్రయించారు. అయితే తమ దస్తావేజుల్లో సర్వే నంబరు తప్పుగా నమోదైందని స్వీయ సవరణ పేరుతో జోగి వెంకటేశ్వరరావు, రాజీవ్ సర్వే నంబరు 87గా మార్చుకుని మళ్లీ రిజిస్టర్ చేయించారు. లింకు డాక్యుమెంట్లలో మాత్రం సర్వే నంబరు 88గానే ఉంది. ఆ తర్వాత వీటిని వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబీకులు, బంధువులకు సర్వే నంబరు 87పై రిజిస్టర్ చేయించారు. అంబాపురం రీసర్వే నంబరు 87లోని భూమి అల్లూరి కృష్ణమూర్తికి అక్కడి నుంచి అగ్రిగోల్డ్‌లో భాగస్వామి అయిన అవ్వావెంకట శేషునారాయణకు విక్రయించినట్లు ఉంది. ఈ సర్వే నంబరులోని 2293.05 గజాల స్థలాన్ని 2018, 2019ల్లో హోం శాఖ జప్తు చేసింది. జోగి రమేష్ తనయుడు దీన్ని 2022లో కొని, 2023లో విక్రయించారు. అంటేజప్తులో ఉన్న భూమిని కొని, విక్రయించారు.క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే.. ఒక సర్వే నంబరు భూమి మరో సర్వే నంబరులో ఉందని తేల్చే అధికారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కే ఉంటుంది. కానీ అన్ని లింకు డాక్యుమెంట్లలో సర్వే నంబరు 88 ఉండగా.. స్వీయ సవరణ ద్వారా జోగి కుటుంబం మాత్రం 87గా మార్చేసింది. మండల రెవెన్యూ అధికారుల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల వరకు అంతా కళ్లు మూసుకుని జప్తులో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసి అప్పగించినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంబాపురంలో క్షేత్రస్థాయి సర్వే లేకుండా ఒక సర్వే నివేదికను రూపొందించి గ్రామ సర్వేయర్ దేదీప్యతో సంతకం చేయించారు. తర్వాత దీన్ని వెబ్‌ల్యాండ్‌లో మార్చి డిప్యూటీ తహసీల్దారు నుంచి ఆమోదం పొందారు. భూమి స్వాధీనానికి తహసీల్దారు ఆదేశాలు ఇచ్చారు. తహసీల్దారు లేఖ ఆధారంగా నున్న సబ్‌రిజిస్ట్రార్ నాగేశ్వరరావు స్వీయ సవరణ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి, దస్తావేజులు ఇచ్చారు. ప్రభుత్వం జప్తు చేసిన తమ భూమిలో ప్రహరీ నిర్మించేస్తున్నారంటూ అగ్రిగోల్డ్ యజమానులు విజయవాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 2023లో మార్చిలోనే ఫిర్యాదు చేసినా.. పోలీసులు దాన్ని పక్కన పడేశారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. నాడు జోగి రమేష్ మంత్రిగా ఉండటంతో దస్త్రాలను తొక్కిపెట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత పత్రికల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత పోలీసులు దస్త్రం బయటకు తీసి, నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ పరిశీలనకు తీసుకెళ్లారు. సీఐడీ బృందాలు రంగంలోకి దిగాయి. ఏసీబీ విచారణ చేపట్టడంతో ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది. జోగి కుటుంబం నుంచి 1,668 గజాల స్థలం కొన్న వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబీకులు మాత్రం మౌనంగానే ఉన్నారు. ప్రభుత్వ ధర ప్రకారం ఈ స్థలాల విలువ దాదాపు రూ.4.50 కోట్లు. మార్కెట్ విలువ ప్రకారం రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
బాధ్యులైన అధికారులపై చర్యలు:
ఈ వ్యవహారంలో సబ్‌రిజిస్ట్రార్ నాగేశ్వరరావు పాత్ర చాలా స్పష్టంగా ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత ఆయనను ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా నియమించారు. తహసీల్దారు జాహ్నవిని బదిలీ చేయకుండా అదే పోస్టులో కొనసాగించారు. తమకు సంబంధం లేకుండానే సర్వే నంబరు మార్చారని మండల సర్వేయర్, తహసీల్దారు జాహ్నవి అధికారులకు చెప్పినట్లు తెలిసింది. గ్రామ సర్వేయర్ మాత్రం తాను సర్వే చేయలేదని వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే గ్రామ సర్వేయర్ దేదీప్య, డిప్యుటీ తహసీల్దార్ విజయ్‌కుమార్‌లను సస్పెండ్ చేశారు. మండల సర్వేయర్ రమేశ్ సస్పెన్షన్‌కు సిఫార్సు చేశారు. మరికొందరిపైనా వేటు పడనున్నట్లు తెలిసింది.