ఏలూరుజిల్లా, మండవల్లి (ద డెస్క్ న్యూస్) : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం స్టూడెంట్ కిట్స్ ను పంపిణి చేశారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న పధకాలను సధ్వినియోగం చేసుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యార్థులు చదువు క్రమశిక్షణతో మెలిగి ఉండాలని, చెడు వ్యసనాలకు లోనయ్యి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
