ఏలూరు జిల్లా, ఏలూరు (ద డెస్క్ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 సంవత్సరానికి దేశస్థాయిలో అగ్రగామిగా నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ వికసిత్ ఆంధ్ర కార్యక్రమాన్ని అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసారని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధికారులు పాల్గొనగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు మేరకు జిల్లా నుంచి డీపీఓ, పీడీ ద్వామా, పీడీ డి.ఆర్.డి.ఏ, సీపీఓ, స్టాటిష్టికల్ అధికారి తదితరులు వికసిత్ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. వర్కషాపులో ఎకానమీ పెరుగుదల, అభివృద్ధి పెరుగుదల అంశాలపై అవగాహన కల్పించారాని అన్నారు. జీరో పేదరికం ప్రజల జీవనప్రమాణాలు ఏవిధంగా పెంచాలి, ఆర్ధిక అసమానతలు దూరం చేయడం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించడం, ప్రాధమిక రంగమైన వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవ రంగం అభివృద్ధి ఎలా చేయాలని వర్కుషాపులో వివరంగా చెప్పారని అన్నారు. త్వరలో జిల్లాలో కూడా అధికారులతో ఒక వర్కుషాపు ఏర్పాటు చేసి వికసిత్ ఆంధ్ర విజన్ పై అవగాహన కల్పించానున్నామని అన్నారు. కార్యక్రమంలో పీడీ డి.ఆర్.డి.ఏ విజయ్ రాజ్, పీడీ ద్వామా రాము, సీపీఓ బి శ్రీదేవి, స్టాటిష్టికల్ ఆఫీసర్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.
