ఏలూరు జిల్లా, కైకలూరు/ముదినేపల్లి (ద డెస్క్ న్యూస్) : ఇటీవల ముదినేపల్లి మండల తహసిల్దారుగా బాధ్యతలు చేపట్టిన జేఎస్ సుభాని కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం వరాహపట్నంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద సుభాని ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. తహసీల్దార్ వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు.
