The Desk News : బాణాసంచ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం

The Desk News : బాణాసంచ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా, THE DESK NEWS : పెనుమంట్ర మండలం ఆలమూరు లో లక్ష్మీ ఫైర్ వర్క్స్ లో మంటలు చెలరేగాయి. దీంతో షాప్ లో ఉన్న బాణాసంచా పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల్లో ఆస్తి నష్టం వాటిల్లింది.. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు బాణాసంచా పేలుళ్లకు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.. ఫైర్ జరిగిన ప్రాంతాన్ని నరసాపురం DSP జి. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 9:45 ప్రాంతంలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిందని లోపల ఉన్న బాణాసంచా పూర్తిగా కాలిపోయిందని తెలిపారు.. ఫైర్ ఆక్సిడెంట్ గల కారణాలు పూర్తి విచారణలో తెలుస్తాయని ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు మంటలు అదుపు చేశారని వారు ఇచ్చే నివేదికబట్టి షార్ట్ సర్క్యూట్ లేక మరియే ఇతర కారణాలు అని దర్యాప్తు చేస్తామని DSP తెలిపారు.