ప.గో జిల్లా, తాడేపల్లిగూడెం/కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాలని ఆంధ్ర, తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళ్లపాలెం బుజ్జి) హోం మంత్రి వంగలపూడి అనిత ను కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం లోని సైనిక్ స్కూల్లో ఆదివారం హోం మంత్రి అనిత ను బుజ్జి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన రంగా పేరును ఏదైనా ఒక జిల్లాకు పెట్టాలని హోం మంత్రి ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. ఆయనతో మిత్రమండలి సభ్యులు తదితరులు ఉన్నారు.
