ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. కృష్ణ ను శనివారం ఎన్డీఏ కూటమి నాయకులు రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పుల రామచంద్రరావు (రాజీ), కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి), జనసేన నాయకులు తులసి పూర్ణచంద్రరావు (పూర్ణ) లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వారి వెంట పలువురు కూటమి నాయకులు ఉన్నారు.
