THE DESK NEWS : కైకలూరు పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ గా పి. కృష్ణ బాధ్యతలు స్వీకరణ

THE DESK NEWS : కైకలూరు పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ గా పి. కృష్ణ బాధ్యతలు స్వీకరణ

ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పలివెల కృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా విజయవాడ కమీషనరేట్ నుండి కైకలూరు కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.