THE DESK NEWS : ద్విచక్ర వాహదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి : రూరల్ సీ.ఐ బి. కృష్ణ కుమార్

THE DESK NEWS : ద్విచక్ర వాహదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి : రూరల్ సీ.ఐ బి. కృష్ణ కుమార్

ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లను ధరించాలని కైకలూరు రూరల్ సీ.ఐ బి. కృష్ణ కుమార్ సూచించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు మండలంలోని గోనిపాడు గ్రామం వద్ద బుధవారం జాతీయ రహదారి పై హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు రూరల్ సీ.ఐ కృష్ణకుమార్, ఎస్సై రామకృష్ణ లు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సి.ఐ కృష్ణకుమార్, ఎస్సై రామకృష్ణ లు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలలోనే తలకు తీవ్ర గాయాలై మృత్యువాత పడుతున్నారన్నారు. హెల్మెట్ విధిగా ధరించి ప్రమాదాల బారినుండి ప్రాణాలను రక్షించుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమన్నారు. అలాగే వాహనాలకు సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన యెడల చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని సీ.ఐ కృష్ణకుమార్ హెచ్చరించారు.