ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS :
మండవల్లిమండలం కానుకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి చేపట్టిన గంజాయి రహిత గ్రామాలుకావాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామంలో డ్రగ్స్ అలవాటు పడినవారు మానుకోవాలని స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తోగ్రామంలో ర్యాలీ నిర్వహించారు. చదువు నిమిత్తం ఆమె బయట ఉన్నవైష్ణవి తండ్రి గారు డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మొదట ప్రభుత్వం పంపిణీ చేసిన విద్యార్థులకు బ్యాగులు బెల్టులు పంపిణీ అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తిలకించిన కానుకొల్లు గ్రామ పెద్దలు డాక్టర్ మనోజ్ ని అభినందించారు.