THE DESK NEWS : గంటల వ్యవధిలోనే బ్యాంకు ఉద్యోగి అరెస్ట్… పోలీసుల అదుపులో కోట్ల రూపాయలు కొట్టేసిన కేటుగాడు

THE DESK NEWS : గంటల వ్యవధిలోనే బ్యాంకు ఉద్యోగి అరెస్ట్… పోలీసుల అదుపులో కోట్ల రూపాయలు కొట్టేసిన కేటుగాడు

తూగో. జిల్లా, రాజమండ్రి, (ద డెస్క్ న్యూస్) :

2.2 కోట్లు చోరీ..‼️

గంటల వ్యవధిలోనే నిందితుడు అరెస్ట్…

రాజమహేంద్రవరంలోని HDFC బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్‌ను అదుపులోకి తీసుకుని.. డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వివరాలను ఎస్పీ నర్సింహ కిశోర్‌ మీడియాకు వెల్లడించారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్‌ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతోనే అతడు నగదు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి అశోక్‌ పరారైనట్లు తెలిపారు. ఫిర్యాదు అందగానే 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడి చోరీకి ప్లాన్‌ చేశాడని వివరించారు. ఏటీఎంలకు ఎప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయో ముందుగానే గుర్తించి చోరీకి తేదీని కూడా నిందితుడు ముందుగానే నిర్ణయించుకున్నాడని తెలిపారు. సాంకేతిక ఆధారాలు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు SP వివరించారు.

మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్‌(27) డిగ్రీ చేశాడు. రాజమహేంద్రవరంలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించిన 11 ATM లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట HDFC శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని కారులో పరారయ్యడు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.