ఏలూరు జిల్లా, THE DESK NEWS : కైకలూరు నియోజకవర్గం, కలిదిండి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారి ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధం లో పాల్గొన్న వీర జవాన్ జంగం డేవిడ్ రాజు ను ఘనంగా సత్కరించిన కలిదిండి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సానా వెంకటరామారావు, ఛైర్మన్ సానా మీనా సరస్వతి. అనంతరం ఛైర్మన్ మీనా సరస్వతి మాట్లాడుతూ మనం ఎండ వేడిమి తట్టుకోలేక వడ దెబ్బ తగిలి హాస్పిటల్ పాలవుతుంటాం. అలాగే చలి ఎక్కువగా ఉన్నా స్వెట్టర్ వేసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటాం. అటువంటిది మరి మన కోసం మన దేశ భద్రత కోసం, మండుటెండల్లో ఎండను సైతం లెక్కచేయకుండా, అలాగే మంచు ప్రాంతంలో ఐస్ ను ఒంటి మీద కప్పుకొని సరిహద్దుల్లో పోరాడుతున్న జవాన్లకు కృతజ్ఞతలు తెలియజేయడం, వారిని సన్మానించడం మన కనీస బాధ్యత అని అన్నారు. వీర జవాన్ డేవిడ్ రాజు మాట్లాడుతూ దాదాపు మూడు నెలలకు పైగా సాగిన కార్గిల్ యుద్ధం లో మాకు ఆకలి దప్పిక అనేవి లేకుండా పోరాడమని, ఇప్పుడు యువత ఆర్మీకి వెళ్ళడానికి అందరూ వెనుకడుగు వేస్తున్నారు, దేశ భద్రత కోసం ఆర్మీకి వెళ్ళడం మన బాధ్యతగా భావించండి అని ఆయన తెలిపారు. అనంతరం టిడిపి నాయకులు జక్కుల విజయ్ కుమార్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.