🔴 న్యూఢిల్లీ : ది డెస్క్ :
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సానా సతీష్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ, అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించడం ప్రజలను భయాందోళనకు గురిచేసే చర్యగా పేర్కొన్నారు. పవిత్రమైన పార్లమెంట్‌ను ప్రచార వేదికగా మార్చడం తగదని ఆయన హితవు పలికారు.
సభలో లేని వ్యక్తుల పేర్లను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని ఎంపీ సానా సతీష్ బాబు డిమాండ్ చేశారు.

