🔴 నెల్లూరు : ది డెస్క్ :
త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి శిష్య బృందంతో కలిసి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
అక్టోబర్ 29న త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వహస్తాలతో వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన

భూమి పూజ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి స్వహస్తాల మీదుగా… శంకుస్థాపన కోసం… నెల్లూరు మూలాపేటలో సిద్ధమవుతున్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవ ఏర్పాట్లను.. ఆదివారం సాయంత్రం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంబంధిత అధికారులు, చిన జీయర్ స్వామి వారి శిష్య బృందం,స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు…ఈ నెల 29 బుధవారం ఉదయం గం.11.18 నిమిషాలకు శుద్ధ అష్టమి ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త ధనుర్లగ్నంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.

